సమాజానికి మంచి చేయడమే నిజమైన దైవ విశ్వాసం :షేక్ అబ్దుల్ బాసిత్
సాటి మనుషులకు సేవ చేయడమే అసలైన ఆరాధన: షేక్ అబ్దుల్ బాసిత్ భద్రాద్రి కొత్తగూడెం, హిందుస్థాన్ మీడియా: సాటి మనుషులకు కష్టం, నష్టం కలిగించకుండా వారికి మేలు చేయడమే నిజమైన దైవ విశ్వాసమని జమాతే ఇస్లామీ హింద్ సభ్యుడు షేక్ అబ్దుల్ బాసిత్ అన్నారు. పవిత్ర శుక్రవారం సందర్భంగా కొత్తగూడెం కార్పొరేషన్ పరిధిలోని మేదర్ బస్తీ మసీద్-ఎ-వహీద్‌లో నిర్వహించిన ప్రత్యేక సమావేశంలో ఆయన మాట్లాడారు. మానవులందరూ ఒకే సృష్టికర్తకు దాసులని, తోటి మనుషులకు సేవ చేయడమే నిజమైన ఆరాధన అని పేర్కొన్నారు. సమాజానికి హాని కలిగించే పనులకు దూరంగా ఉండాలని సూచించారు. ప్రవక్త మహమ్మద్ (సల్లల్లాహు అలైహి వసల్లం) బోధించిన సహనం, దాతృత్వం, నైతిక విలువలను...