EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • స్నేహానికి నిలువెత్తు నిదర్శనం: దివంగత మిత్రుడి కుటుంబానికి బాసటగా నిలిచిన 2000-01బ్యాచ్ విద్యార్థులు

    Author P శివశంకర్ | 06 Sep 2026, 03:42 PM | TELANGANA
    స్నేహానికి నిలువెత్తు నిదర్శనం: దివంగత మిత్రుడి కుటుంబానికి బాసటగా నిలిచిన 2000-01బ్యాచ్ విద్యార్థులు

    చేర్యాల 2000-01 పదవ తరగతి పూర్వ విద్యార్థుల గొప్ప మనసు

    అకాల మరణం చెందిన నీరటి తిరుపతి కుటుంబానికి బాసట.. చిన్నారి అక్షర వాహినికి డిపాజిట్ పత్రాల అందజేత

    మిత్రుడి కుటుంబం కోసం క్లాస్‌మేట్స్ ఐక్యత.. ఆదర్శ ఔదార్యానికి స్థానికుల ప్రశంసలు
    ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా):
    ​స్నేహ బంధానికి నిలువెత్తు నిదర్శనం
    ​మిత్రుడు లేడనే నిజాన్ని జీర్ణించుకుంటూనే, ఆయన కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన స్నేహమని చేర్యాల పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. చేర్యాల పట్టణంలోని వివిధ పాఠశాలల్లో 2000-2001 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా తమ తోటి క్లాస్‌మేట్ నీరటి తిరుపతి అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబానికి బాసటగా నిలిచారు. తిరుపతి చిన్నారి కుమార్తె అక్షర వాహిని బంగారు భవిష్యత్తు కోసం మిత్రులంతా కలిసి తమ వంతు సహాయంగా రూ. 52,300/- విరాళాన్ని సేకరించారు.
    ​సుకన్య సమృద్ధి యోజనలో డిపాజిట్ – బాండ్ పత్రాల అందజేత
    ​సేకరించిన మొత్తం రూ. 52,300/-ను కేంద్ర ప్రభుత్వ పథకమైన 'సుకన్య సమృద్ధి యోజన' (SSY) కింద చిన్నారి అక్షర వాహిని పేరిట పోస్టాఫీస్ ఖాతాలో ఫిక్స్‌డ్ డిపాజిట్ చేశారు. అనంతరం చేర్యాలలో దివంగత మిత్రుడు తిరుపతి నివాసానికి చేరుకుని, చిన్నారి అక్షర వాహినితో పాటు ఆమె కుటుంబ సభ్యులకు ఆ డిపాజిట్ బాండ్ పత్రాలను అందజేశారు. తండ్రి లేని లోటు తీర్చలేనిదైనా, చిన్నారి ఉన్నత చదువులు మరియు భవిష్యత్ అవసరాలకు ఈ మొత్తం కొంతైనా ఆసరాగా నిలుస్తుందని వారు పేర్కొన్నారు.
    ​కార్యక్రమంలో పాల్గొన్న పూర్వ మిత్రులు
    ​కష్టకాలంలో మిత్రుడి కుటుంబానికి అండగా నిలబడి మానవత్వాన్ని చాటుకున్న ఈ కార్యక్రమంలో 2000-01 బ్యాచ్ మిత్రులు పిల్లి రాజు, వేణుగోపాల్, ముంతాజ్ అహ్మద్, గోనె వెంకట్, శ్రీమాన్, కిషన్, భాస్కర్, శ్రీధర్, నవీన్, మహిమూద్, నగేష్, రామాంజనేయులు, ప్రభాకర్ తదితరులు పాల్గొన్నారు. మిత్రుడి కుటుంబం పట్ల బాధ్యతగా వ్యవహరించి సహాయం అందించిన పదవ తరగతి పూర్వ విద్యార్థుల ఔదార్యాన్ని స్థానికులు, గ్రామ పెద్దలు ప్రత్యేకంగా ప్రశంసించారు.
    ​– | హిందుస్థాన్ మీడియా |
    సామాన్యుడి నేస్తం 📰