స్నేహానికి నిలువెత్తు నిదర్శనం: దివంగత మిత్రుడి కుటుంబానికి బాసటగా నిలిచిన 2000-01బ్యాచ్ విద్యార్థులు

చేర్యాల 2000-01 పదవ తరగతి పూర్వ విద్యార్థుల గొప్ప మనసు ​అకాల మరణం చెందిన నీరటి తిరుపతి కుటుంబానికి బాసట.. చిన్నారి అక్షర వాహినికి డిపాజిట్ పత్రాల అందజేత ​మిత్రుడి కుటుంబం కోసం క్లాస్‌మేట్స్ ఐక్యత.. ఆదర్శ ఔదార్యానికి స్థానికుల ప్రశంసలు ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​స్నేహ బంధానికి నిలువెత్తు నిదర్శనం ​మిత్రుడు లేడనే నిజాన్ని జీర్ణించుకుంటూనే, ఆయన కుటుంబానికి అండగా నిలవడమే నిజమైన స్నేహమని చేర్యాల పూర్వ విద్యార్థులు చాటిచెప్పారు. చేర్యాల పట్టణంలోని వివిధ పాఠశాలల్లో 2000-2001 విద్యా సంవత్సరంలో పదవ తరగతి చదివిన పూర్వ విద్యార్థులంతా తమ తోటి క్లాస్‌మేట్ నీరటి తిరుపతి అకాల మరణంతో శోకసంద్రంలో మునిగిన ఆ కుటుంబానికి బాసటగా...