EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గురువుల సేవలు వెలకట్టలేనివి :ఎమ్మార్పీఎస్

    Author P శివశంకర్ | 05 Sep 2026, 09:53 PM | Array
    గురువుల సేవలు వెలకట్టలేనివి :ఎమ్మార్పీఎస్

    గురువుల దినోత్సవం సందర్భంగా ప్రైవేట్‌ టీచర్లకు ఘన సన్మానం
    చేర్యాల, సెప్టెంబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా:
    గురువుల దినోత్సవాన్ని పురస్కరించుకుని చేర్యాల మండలంలోని ప్రైవేట్‌ పాఠశాలల్లో విద్యాబోధన చేస్తున్న ఉపాధ్యాయులను ఎమ్మార్పీఎస్‌ ఆధ్వర్యంలో ఘనంగా సన్మానించారు. ఎమ్మార్పీఎస్‌ మండల అధ్యక్షుడు సొంటే విక్రమ్‌ ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో ఎమ్మార్పీఎస్‌ సీనియర్‌ నాయకుడు మాదాసు యాదగిరి పాల్గొని ఉపాధ్యాయులను శాలువాలతో సత్కరించి గురువుల దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు.
    ఈ సందర్భంగా సొంటే విక్రమ్‌ మాట్లాడుతూ విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర ఎంతో కీలకమని అన్నారు. సమాజానికి మంచి పౌరులను అందించేందుకు ఉపాధ్యాయులు చేస్తున్న కృషి అభినందనీయమని పేర్కొన్నారు. ముఖ్యంగా ప్రైవేట్‌ పాఠశాలల్లో ఎన్నో సవాళ్ల మధ్య విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందిస్తున్న ఉపాధ్యాయుల సేవలను గుర్తించి గౌరవించడం తమ బాధ్యతగా భావిస్తున్నామని తెలిపారు.
    మాదాసు యాదగిరి మాట్లాడుతూ గురువు కేవలం విద్యను మాత్రమే బోధించకుండా విద్యార్థులకు క్రమశిక్షణ, సంస్కారం, సామాజిక బాధ్యతలను నేర్పుతూ వారి జీవితాలకు మార్గదర్శకంగా నిలుస్తారని అన్నారు. ఉపాధ్యాయుల సేవలను గౌరవించడం ప్రతి ఒక్కరి బాధ్యత అని పేర్కొన్నారు.