EPAPER ఆంధ్రప్రదేశ్ తెలంగాణ జాతీయం సినిమా క్రీడలు బిజినెస్ క్రైమ్ భక్తి Live TV రాశిఫలాలు
  • అడ్మిన్ లాగిన్ (Admin Login)
  • గురువును గౌరవించడమే విద్యార్థులు ఇచ్చే నిజమైన బహుమతి : సీపీ రష్మి పెరుమాళ్

    Author P శివశంకర్ | 05 Sep 2026, 07:38 PM | TELANGANA
    గురువును గౌరవించడమే విద్యార్థులు ఇచ్చే నిజమైన బహుమతి : సీపీ రష్మి పెరుమాళ్

    బాలికలు ఆత్మరక్షణ విద్య నేర్చుకోవాలి

    సైబర్‌ నేరాలపై అప్రమత్తంగా ఉండాలి: సీపీ
    చేర్యాల, సెప్టెంబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా:
    ముత్యాల గ్రామంలోని తెలంగాణ మోడల్‌ స్కూల్‌లో నిర్వహించిన ఉపాధ్యాయ దినోత్సవ వేడుకలకు సిద్దిపేట పోలీస్‌ కమిషనర్‌ రష్మి పెరుమాళ్‌, ఐపీఎస్‌ ముఖ్య అతిథిగా హాజరయ్యారు. ఈ సందర్భంగా విద్యార్థులు, ఉపాధ్యాయులను ఉద్దేశించి ఆమె ప్రసంగించారు.
    విద్యార్థుల భవిష్యత్తును తీర్చిదిద్దడంలో ఉపాధ్యాయుల పాత్ర అత్యంత కీలకమని సీపీ అన్నారు. తరగతి గదిలో ఉపాధ్యాయులు చెప్పే విషయాలను క్రమశిక్షణతో వినాలని, గురువును గౌరవించడం, విధేయతతో ఉండటమే వారికి విద్యార్థులు ఇచ్చే నిజమైన బహుమతి అని పేర్కొన్నారు.
    బాలికలు మానసికంగా, శారీరకంగా ధైర్యంగా ఉండాలని సూచించారు. ప్రతి బాలిక ఆత్మరక్షణ విద్యను నేర్చుకోవాలని, వేధింపులు ఎదురైతే భయపడకుండా వెంటనే తల్లిదండ్రులు, ఉపాధ్యాయులు లేదా పోలీస్‌ షీ టీమ్స్‌కు సమాచారం అందించాలని తెలిపారు.
    డిజిటల్‌ యుగంలో సైబర్‌ నేరాల పట్ల అప్రమత్తంగా ఉండాలని సూచించారు. అపరిచితులతో ఆన్‌లైన్‌ పరిచయాలు పెంచుకోవద్దని, ఓటీపీలు, వ్యక్తిగత సమాచారాన్ని ఎవరితోనూ పంచుకోవద్దని తెలిపారు. సైబర్‌ మోసానికి గురైతే వెంటనే 1930 టోల్‌ఫ్రీ నంబర్‌కు ఫిర్యాదు చేయాలని సూచించారు.
    కార్యక్రమంలో చేర్యాల సీఐ రమేష్‌, ఎస్‌ఐ అపూర్వ రెడ్డి పాల్గొన్నారు.