నాగపురి పాఠశాలలో అందెశ్రీ ప్రథమ వర్ధంతి

తెలంగాణ రాష్ట్ర గీత రచయితకు ఘన నివాళులు పల్లె కవి.. ప్రజా కవి.. ప్రపంచ కవిగా ఎదిగిన అందెశ్రీ: ప్రధానోపాధ్యాయుడు ఐలయ్య నాగపురి, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మండలం నాగపురి జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో తెలంగాణ రాష్ట్ర గీత రచయిత డాక్టర్ అందెశ్రీ ప్రథమ వర్ధంతి కార్యక్రమాన్ని మంగళవారం నిర్వహించారు. ఈ సందర్భంగా పాఠశాల ఆవరణలో ఆయన చిత్రపటానికి పూలమాల వేసి ఉపాధ్యాయులు, సిబ్బంది ఘనంగా నివాళులర్పించారు.ఈ సందర్భంగా పాఠశాల ప్రధానోపాధ్యాయుడు ఎలికట్ట ఐలయ్య మాట్లాడుతూ.. ఉమ్మడి వరంగల్ జిల్లా మద్దూరు మండలం రేబర్తి గ్రామంలో 1961 జూలై 18న జన్మించిన అందెశ్రీ, 2025 నవంబర్ 10న హైదరాబాద్‌లో కన్నుమూశారని తెలిపారు. పశువుల కాపరిగా...