బతికున్న వారికి మరణ ధ్రువీకరణ పత్రాలు.. రాంపూర్ పంచాయతీ కార్యదర్శి, మరో వ్యక్తి పై కేసు నమోదు

​వ్యక్తిగత ఈ-సైన్ (E-sign) డాంగిల్ కీని ప్రైవేట్ వ్యక్తి చేతిలో పెట్టిన రాంపూర్ పంచాయతీ కార్యదర్శి భుక్య మధు ​హైదరాబాద్‌లోని ఇంటర్నెట్ సెంటర్ కేంద్రంగా ఏకంగా 22 నకిలీ డెత్ సర్టిఫికెట్ల జారీ ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): చేర్యాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామ పంచాయతీలో అధికారిక డిజిటల్ సంతకాన్ని (ఈ-సైన్) దుర్వినియోగం చేస్తూ, బతికి ఉన్న వ్యక్తుల పేరిట మరణ ధృవీకరణ పత్రాలు (డెత్ సర్టిఫికెట్లు) జారీ చేసిన భారీ మోసం తీవ్ర కలకలం రేపింది. సిద్దిపేట జిల్లా కలెక్టర్ ఆదేశాల మేరకు చేర్యాల మండల పంచాయతీ అధికారి (ఎంపీవో) స్థానిక పోలీస్ స్టేషన్‌లో లిఖితపూర్వక ఫిర్యాదు చేయడంతో ఈ వ్యవహారం వెలుగులోకి వచ్చింది....