చేర్యాల మండలం లోని రాంపూర్ గ్రామ కార్యదర్శి పై సస్పెన్షన్ వేటు..??

గ్రామ కార్యదర్శిపై వేటు పడినట్లు ప్రచారం.. కారణాలపై ఉత్కంఠ చేర్యాల, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మండల పరిధిలోని రాంపూర్ గ్రామ పంచాయతీ కార్యదర్శి సస్పెన్షన్‌కు గురైనట్లు సమాచారం. అయితే సస్పెన్షన్‌కు సంబంధించిన అధికారిక ఉత్తర్వులు, అందుకు గల కారణాలు ఇంకా తెలియాల్సి ఉంది.విధి నిర్వహణలో నిర్లక్ష్యమా? లేక ఇతర కారణాలేమైనా ఉన్నాయా? అన్న అంశాలపై స్పష్టత రావాల్సి ఉంది. సంబంధిత అధికారుల నుంచి అధికారిక సమాచారం అందిన తర్వాత పూర్తి వివరాలు వెల్లడికానున్నాయి.