భూగర్భ జలాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : కవి గాయకుడు పిన్నింటిరత్నం

ఆయన రచనలతో ఆటపాటలు, నాటికల ద్వారా నీటి సంరక్షణపై చైతన్యం అయినాపూర్, హిందుస్థాన్ మీడియా: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కవి, గాయకుడు పిన్నింటి రత్నం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆదేశాల మేరకు కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామానికి చెందిన ఆయన తన పాటలు, రచనలు, ఆటపాటలు, నాటికల ద్వారా ప్రజలకు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా పిన్నింటి రత్నం మాట్లాడుతూ.. ఎల్‌నినో, కరువు ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పది పాటలు రచించి భాషా...