పెన్షన్ మంజూరులో జాప్యం గీత కార్మికుడి ఆవేదన..

పెన్షన్ మంజూరులో జాప్యంపై జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు సిద్దిపేట, నవంబర్ 2, హిందుస్థాన్ మీడియా: గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్న తనకు ప్రభుత్వ పెన్షన్ మంజూరు విషయంలో ఇబ్బందులు ఎదురవుతున్నాయని దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామానికి చెందిన బండారం సత్యయ్య జిల్లా కలెక్టర్‌కు ఫిర్యాదు చేశారు.తాను గీత కార్మికుడిగా జీవనం సాగిస్తున్నానని, ప్రభుత్వ పెన్షన్ పొందేందుకు అవసరమైన పత్రాల కోసం గ్రామ పంచాయతీ కార్యదర్శిని సంప్రదించినట్లు తన ఫిర్యాదులో పేర్కొన్నారు. అయితే ఈ ప్రక్రియలో ఎదురవుతున్న ఇబ్బందుల కారణంగా పెన్షన్ మంజూరులో జాప్యం జరుగుతోందని కలెక్టర్ దృష్టికి తీసుకెళ్లారు.తన సమస్యను పరిశీలించి, పెన్షన్ మంజూరుకు అవసరమైన చర్యలు తీసుకుని న్యాయం చేయాలని సత్యయ్య కోరారు. అర్హులైన...