అన్ని స్కూళ్లు ఒకవైపు.. నవోదయ మరోవైపు! సెలవుల షెడ్యూల్లో వ్యత్యాసం.. విద్యార్థుల కుటుంబ ఆనందానికి అవరోధం!
నవోదయ సెలవుల విధానంపై పునరాలోచించాలి.. కేంద్ర ప్రభుత్వానికి తల్లిదండ్రుల విజ్ఞప్తి హిందుస్థాన్ మీడియా ప్రత్యేక సంపాదకీయ కథనం పిల్లలకు నాణ్యమైన విద్య అందించాలనే ఆశతో తల్లిదండ్రులు వారిని హాస్టళ్లలో ఉంచి చదివిస్తున్నారు. నెలల తరబడి కుటుంబానికి దూరంగా ఉండే పిల్లలకు పండుగ సెలవులు ఎంతో విలువైనవి. ఆ సమయంలో కుటుంబమంతా కలిసి ఆనందంగా గడపాలని ప్రతి తల్లిదండ్రి కోరుకుంటారు. అయితే సెలవుల షెడ్యూల్లో వ్యత్యాసం ఉంటే ఆ ఆనందానికి ఆటంకం కలిగే పరిస్థితులు ఎదురవుతున్నాయి. తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వ పాఠశాలలకు అక్టోబర్ 10 నుంచి 22 వరకు సెలవులు ఉండగా, నవోదయ విద్యాలయాల విద్యార్థులకు అక్టోబర్ 19 నుంచి నవంబర్ 11 వరకు సెలవులు ఉన్నట్లు...