ఆదుకునే ఊరు అర్జున పట్ల.... మరోసారి నిరూపించిన ఉపాధ్యాయులు, గ్రామస్తులు

పేద విద్యార్థినికి ₹32 వేల ఆర్థిక సాయం! ​నిమ్స్‌లో బీఎస్సీ నర్సింగ్ సీటు సాధించిన ప్రతిభావంతురాలు కెమ్మసరం బాలలక్ష్మి ​పతాకావిష్కరణ వేదికపైనే ఉపాధ్యాయుల , ప్రజాప్రతినిధుల, గ్రామస్తుల దాతృత్వం ​పేదరికాన్ని జయించిన విద్యార్థినికి అండగా నిలిచి ఆదర్శంగా మారిన అర్జునపట్ల బడి ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​హెచ్‌ఎం రామచంద్రమూర్తి నేతృత్వంలో వేడుకలు – మానవత్వ వితరణ ​తెలంగాణ ప్రజాపాలన దినోత్సవం సందర్భంగా చేర్యాల మండలంలోని అర్జునపట్ల ప్రభుత్వ ఉన్నత పాఠశాలలో ఇన్‌ఛార్జ్ ప్రధానోపాధ్యాయులు (HM) రామచంద్రమూర్తి గారి ఆధ్వర్యంలో వేడుకలు అత్యంత ఘనంగా, ఆదర్శప్రాయంగా జరిగాయి. పాఠశాల ప్రాంగణంలో ఆయన నేతృత్వంలో జాతీయ పతాకావిష్కరణ ఘనంగా నిర్వహించిన అనంతరం, అదే వేదిక సమాజహితమైన గొప్ప దాతృత్వానికి...