వైద్యం కోసం రెండు లక్షల Loc మంజూరు చేయించిన కవ్వంపల్లి

అనారోగ్యంతో బాధపడుతున్న సత్తవ్వకు NIMS చికిత్స కోసం LOC మంజూరు ఇల్లంతకుంట, సెప్టెంబర్‌ 8, హిందుస్థాన్‌ మీడియా: నిరుపేద కుటుంబాలకు వైద్య సహాయం అందిస్తూ ఆపదలో అండగా నిలుస్తున్న మానకొండూర్‌ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్‌ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి (హెచ్‌/ఓ చింతకుంటపల్లి) గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జేరిపోతుల సత్తవ్వ వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల విలువైన LOC మంజూరు చేయించారు. గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్తవ్వకు NIMS ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఈ LOC అందించారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య ఖర్చులు అవసరమైతే మరో LOC కూడా మంజూరు...