ప్రశాంత వాతావరణంలో గణేష్ ఉత్సవాలు నిర్వహించాలి: డీజీపీ సీవీ ఆనంద్
మండపాల భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, నిమజ్జన రూట్లపై ముందస్తు ప్రణాళిక తప్పనిసరి అన్ని జిల్లాల పోలీసు అధికారులతో డీజీపీ సీవీ ఆనంద్ వీడియో కాన్ఫరెన్స్ రాజన్న సిరిసిల్ల జిల్లా, సెప్టెంబర్ 7, హిందుస్థాన్ మీడియా: ఈ నెల 14 నుంచి ప్రారంభమయ్యే గణేష్ నవరాత్రి ఉత్సవాలను ప్రశాంతంగా నిర్వహించేందుకు పటిష్టమైన భద్రతా చర్యలు చేపట్టాలని రాష్ట్ర డీజీపీ సీవీ ఆనంద్ పోలీసు అధికారులను ఆదేశించారు. సోమవారం అన్ని జిల్లాల ఎస్పీలు, సీపీలు, పోలీసు అధికారులతో వీడియో కాన్ఫరెన్స్ నిర్వహించి ఉత్సవాల భద్రతా ఏర్పాట్లపై సమీక్షించారు. గణేష్ మండపాలు, విగ్రహాల ఏర్పాటు ప్రదేశాలు, ఊరేగింపు మార్గాలు, తేదీలు, సమయాలకు సంబంధించిన పూర్తి వివరాలను ముందుగానే సేకరించాలని సూచించారు....