అన్న కొడుకు పై కత్తితో దాడి... నిందితుడికి రిమాండ్
దూల్మిట్ట, సెప్టెంబర్ 7, హిందుస్థాన్ మీడియా: అన్న కొడుకుపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని మద్దూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మద్దూరు ఎస్‌ఐ అసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. దూల్మిట్ట మండలం కొండాపూర్ హనుమ తండా పరిధిలోని మహారాజ్ తండాకు చెందిన సభావత్ దేవేందర్ ఐదేళ్ల క్రితం తన అన్న కొడుకు సభావత్ రాజేష్ వద్ద ఒకటిన్నర గుంటల భూమిని కొనుగోలు చేశాడు. అయితే భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయకుండా రాజేష్ కాలయాపన చేస్తున్నాడనే విషయంలో, అలాగే వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే దారి విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న...