ప్రభుత్వ బడికి వన్నె తెస్తున్న ఆదర్శ ఉపాధ్యాయుడు చేగూరి దేవరాజ్
పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యే ధ్యేయం.. వినూత్న కార్యక్రమాలతో ప్రత్యేక గుర్తింపు రెండుసార్లు జిల్లా ఉత్తమ ఉపాధ్యాయ అవార్డు.. తాజాగా రాష్ట్ర స్థాయి ఉత్తమ ఉపాధ్యాయ పురస్కారం సిద్దిపేట జిల్లా, హిందుస్థాన్ మీడియా: ప్రభుత్వ పాఠశాలలో చదివి, అదే ప్రభుత్వ బడిలో ఉపాధ్యాయుడిగా సేవలందిస్తూ పేద విద్యార్థులకు నాణ్యమైన విద్యను అందించడమే లక్ష్యంగా ముందుకు సాగుతున్న ఆదర్శ ఉపాధ్యాయుడు చేగూరి దేవరాజ్. విద్యార్థుల సంఖ్య పెంపుతో పాటు వినూత్న బోధనా పద్ధతులు, కిచెన్ గార్డెన్, క్రీడలు, సైన్స్ ప్రాజెక్టులు, సమాజ భాగస్వామ్యంతో పాఠశాలల అభివృద్ధికి ఆయన విశేష కృషి చేస్తున్నారు. 45 మంది నుంచి 98 మందికి.. మెదక్ జిల్లా రేగోడు మండలం నిర్జష్ణ పాఠశాలలో...