36 ఏళ్లయినా అభివృద్ధి ఎక్కడ..?మద్దూర్ మండలానికి తప్పని వెనుకబాటుతనం
ప్రభుత్వాలు మారినా మారని రహదారుల దుస్థితి.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు ఇరుకైన ముస్త్యాల – రామవరం రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని ఎడతెగని డిమాండ్ అసెంబ్లీలో గళమెత్తి నిధులు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రజల విజ్ఞప్తి మద్దూరు (హిందుస్థాన్ మీడియా): దశాబ్దాలు గడిచినా తీరని రోడ్డు కష్టాలు మద్దూరు ప్రత్యేక మండలంగా ఏర్పాటై 36 సంవత్సరాలు పూర్తవుతున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన అభివృద్ధి జరగలేదని మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా మండలంలోని ప్రధాన రహదారుల దుస్థితి మాత్రం మారకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అనేక గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే...