ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో సత్తా చాటిన అయినాపూర్ విద్యార్థులు

ఖో-ఖో పోటీల్లో ప్రతిభ కనబరిచిన విద్యార్థినీ, విద్యార్థులు కొమురవెల్లి, సెప్టెంబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా: ఎస్‌జీఎఫ్‌ క్రీడల్లో భాగంగా జడ్పీహెచ్‌ఎస్‌ ఐనాపూర్‌లో నిర్వహించిన ఖో-ఖో పోటీల్లో ఐనాపూర్‌ విద్యార్థినీ, విద్యార్థులు ప్రతిభ చాటారు. సీనియర్‌, జూనియర్‌ బాలురు, బాలికల విభాగాల్లో వివిధ పాఠశాలల విద్యార్థులు పోటీల్లో పాల్గొన్నారు. ఈ సందర్భంగా పోటీల్లో విజేతలుగా నిలిచిన విద్యార్థులను ఐనాపూర్‌ గ్రామ సర్పంచ్‌ కళ్యాణి కృష్ణ అభినందించి బహుమతులు అందజేశారు. క్రీడలతో పాటు చదువులోనూ రాణించాలని ఆమె సూచించారు. కార్యక్రమంలో జడ్పీహెచ్‌ఎస్‌ ఐనాపూర్‌ ప్రధానోపాధ్యాయులు జె. శ్రీనివాస్‌రెడ్డి, ఉపసర్పంచ్‌, ఎస్‌జీఎఫ్‌ మండల సెక్రటరీ జి. శివాని, ఉపాధ్యాయులు బిక్షపతి, కిష్టయ్య, పాఠశాల ఉపాధ్యాయ బృందం తదితరులు పాల్గొన్నారు.