జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను సన్మానించిన దుద్దెడ క్లబ్ సభ్యులు

కొండపాక, సెప్టెంబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా: ఎస్‌జీఎఫ్‌ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన దుద్దెడ విద్యార్థులను గ్రామ కబడ్డీ క్లబ్‌ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు సిరిసనగండ్ల జిల్లా పరిషత్‌ ఉన్నత పాఠశాలలో జరిగిన కొండపాక మండల స్థాయి ఎస్‌జీఎఫ్‌ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు. అండర్‌-17 విభాగంలో 10వ తరగతి విద్యార్థులు జక్కుల సృజన్‌, దోమల మహేష్‌, అండర్‌-14 విభాగంలో 8వ తరగతి విద్యార్థులు పి. నైతిక్‌, జి. హర్షవర్ధన్‌ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్‌ మిద్దె శివకుమార్‌, కబడ్డీ క్లబ్‌ అధ్యక్షుడు పెద్దంకుల శ్రీకాంత్‌, ప్రధాన కార్యదర్శి...