భూగర్భ జలాలను కాపాడుకోవడం ప్రతి ఒక్కరి బాధ్యత : కవి గాయకుడు పిన్నింటిరత్నం
ఆయన రచనలతో ఆటపాటలు, నాటికల ద్వారా నీటి సంరక్షణపై చైతన్యం
అయినాపూర్, హిందుస్థాన్ మీడియా: ఎల్‌నినో ప్రభావంతో ఎదురయ్యే కరువు పరిస్థితులను దృష్టిలో ఉంచుకుని ప్రజలు ఇప్పటి నుంచే అప్రమత్తంగా ఉండాలని తెలంగాణ సాంస్కృతిక సారథి కవి, గాయకుడు పిన్నింటి రత్నం పిలుపునిచ్చారు. తెలంగాణ ప్రభుత్వం, జిల్లా కలెక్టర్, జిల్లా సమాచార పౌరసంబంధాల శాఖ, తెలంగాణ సాంస్కృతిక సారథి ఆదేశాల మేరకు కొమురవెల్లి మండలం అయినాపూర్ గ్రామానికి చెందిన ఆయన తన పాటలు, రచనలు, ఆటపాటలు, నాటికల ద్వారా ప్రజలకు నీటి సంరక్షణపై అవగాహన కల్పిస్తున్నారు.ఈ సందర్భంగా పిన్నింటి రత్నం మాట్లాడుతూ.. ఎల్‌నినో, కరువు ప్రభావాలపై ప్రజల్లో చైతన్యం కల్పించేందుకు పది పాటలు రచించి భాషా సాంస్కృతిక శాఖకు అందజేసినట్లు తెలిపారు. భూగర్భ జలాలు అడుగంటిపోకుండా ప్రతి నీటి చుక్కను ఒడిసిపట్టుకోవాలని, నీటిని వృథా చేయకుండా పొదుపుగా వినియోగించాలని సూచించారు. ప్రతి ఇంటి ముందు ఇంకుడు గుంతలు నిర్మించుకోవాలని, వ్యవసాయ పొలాల వద్ద పంట కుంటలు, నీటి కుంటలు ఏర్పాటు చేసుకోవాలని కోరారు.వేసవిలో పశువులకు అవసరమైన పశుగ్రాసాన్ని ముందుగానే సమకూర్చుకోవాలని, వనమహోత్సవంలో భాగంగా మొక్కలు నాటి పర్యావరణ పరిరక్షణకు కృషి చేయాలని పిలుపునిచ్చారు. ఎల్‌నినో ప్రభావాన్ని ఎదుర్కోవాలంటే ప్రతి ఒక్కరూ నీటి సంరక్షణను బాధ్యతగా తీసుకోవాలని అన్నారు.తన పాటల రచనలతో పాటు సోషల్ మీడియా వేదికగా కూడా ప్రజలకు అవగాహన కల్పిస్తూ నీటి వనరుల పరిరక్షణ కోసం కృషి చేస్తున్నట్లు పిన్నింటి రత్నం తెలిపారు.