బొబ్బాయిపల్లికి బస్సు సౌకర్యం కల్పించాలని సర్పంచ్ సంపత్ వినతి
కొండపాక, సెప్టెంబర్ 8, హిందుస్థాన్ మీడియా:
బొబ్బాయిపల్లి గ్రామానికి ఆర్టీసీ బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ సర్పంచ్ సంపత్ యాదవ్ కోరారు. ఈ మేరకు మంగళవారం గజ్వేల్-ప్రజ్ఞాపూర్ డిపో మేనేజర్‌ను కలిసి వినతిపత్రం అందజేశారు.
గ్రామానికి బస్సు సౌకర్యం లేకపోవడంతో విద్యార్థులు, ఉద్యోగులు, వృద్ధులు, ప్రజలు రాకపోకలకు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారని సర్పంచ్ తెలిపారు. ప్రజల ఇబ్బందులను దృష్టిలో ఉంచుకుని బొబ్బాయిపల్లికి ఆర్టీసీ బస్సు సర్వీసు ఏర్పాటు చేయాలని కోరినట్లు పేర్కొన్నారు.
అధికారులు సానుకూలంగా స్పందించి త్వరలో బస్సు సౌకర్యం కల్పించాలని గ్రామ ప్రజలు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు.