వైద్యం కోసం రెండు లక్షల Loc మంజూరు చేయించిన కవ్వంపల్లి
అనారోగ్యంతో బాధపడుతున్న సత్తవ్వకు NIMS చికిత్స కోసం LOC మంజూరు
ఇల్లంతకుంట, సెప్టెంబర్ 8, హిందుస్థాన్ మీడియా:
నిరుపేద కుటుంబాలకు వైద్య సహాయం అందిస్తూ ఆపదలో అండగా నిలుస్తున్న మానకొండూర్ ఎమ్మెల్యే, టీపీసీసీ ఎస్సీ సెల్ రాష్ట్ర అధ్యక్షుడు కవ్వంపల్లి సత్యనారాయణ మరోసారి మానవత్వం చాటుకున్నారు. ఇల్లంతకుంట మండలం గొల్లపల్లి (హెచ్/ఓ చింతకుంటపల్లి) గ్రామానికి చెందిన నిరుపేద కుటుంబానికి చెందిన జేరిపోతుల సత్తవ్వ వైద్య చికిత్స కోసం రూ.2 లక్షల విలువైన LOC మంజూరు చేయించారు.
గత కొంతకాలంగా అనారోగ్యంతో బాధపడుతున్న సత్తవ్వకు NIMS ఆసుపత్రిలో చికిత్స నిమిత్తం ఈ LOC అందించారు. భవిష్యత్తులో మరిన్ని వైద్య ఖర్చులు అవసరమైతే మరో LOC కూడా మంజూరు చేయించేందుకు కృషి చేస్తానని ఎమ్మెల్యే హామీ ఇచ్చినట్లు కుటుంబ సభ్యులు తెలిపారు.
ఈ సహాయానికి సహకరించిన మండల పార్టీ అధ్యక్షుడు భాస్కర్‌రెడ్డి, PACS చైర్మన్ ఊట్కూరి రమణరెడ్డి, గొల్లపల్లి గ్రామానికి చెందిన న్యాయవాది కడగండ్ల తిరుపతికి జేరిపోతుల సత్తవ్వ కుటుంబ సభ్యులు కృతజ్ఞతలు తెలిపారు.