పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటి బహుమతులు అందించిన అందె విజయ్
పర్యావరణ పరిరక్షణతో పాటు విద్యార్థులను ప్రోత్సహిస్తున్న ఉపాధ్యాయుడు
నాగపురి, సెప్టెంబర్ 8, హిందుస్థాన్ మీడియా:
జడ్పీహెచ్‌ఎస్ నాగపురి పాఠశాలలో ఆంగ్ల ఉపాధ్యాయుడు అందె విజయ్‌కుమార్ తన పుట్టినరోజును వినూత్నంగా జరుపుకున్నారు. పాఠశాల ఆవరణలో మొక్కలు నాటి వాటికి ట్రీ గార్డులు ఏర్పాటు చేశారు. పర్యావరణ పరిరక్షణలో తన వంతు బాధ్యతగా ప్రతి సంవత్సరం పుట్టినరోజు సందర్భంగా మొక్కలు నాటుతున్నానని విజయ్‌కుమార్ తెలిపారు.
అదేవిధంగా తన పుట్టినరోజు సందర్భంగా ఆంగ్లంలో ప్రతిభ కనబరిచిన విద్యార్థులకు బహుమతులు అందించి ప్రోత్సహించారు. విద్యార్థులకు మిఠాయిలు పంపిణీ చేశారు.
పాఠశాల హెచ్‌ఎం ఎలికట్ట ఐలయ్య మాట్లాడుతూ విద్యార్థుల్లో ప్రతిభను గుర్తించి వారికి బహుమతులు అందిస్తూ ప్రోత్సహించడం అభినందనీయమని అన్నారు. విజయ్‌కుమార్ విద్యార్థుల కోసం చేస్తున్న సేవలతో పాటు సామాజిక కార్యక్రమాలు కూడా ఇతరులకు ఆదర్శంగా నిలుస్తున్నాయని ప్రశంసించారు.
కార్యక్రమంలో కృష్ణమూర్తి, నిరుపమ, పద్మ, మనోజ్, ప్రకాశ్‌రెడ్డి, మాధవి, కనకలింగం, స్వర్ణకుమార్, శ్రీధర్, స్వామి, రాజేశ్వరి, ఉమర్ తదితరులు పాల్గొన్నారు.