అన్న కొడుకు పై కత్తితో దాడి... నిందితుడికి రిమాండ్
దూల్మిట్ట, సెప్టెంబర్ 7, హిందుస్థాన్ మీడియా:
అన్న కొడుకుపై కత్తితో దాడి చేసిన వ్యక్తిని మద్దూరు పోలీసులు అరెస్ట్ చేసి రిమాండ్‌కు తరలించారు. మద్దూరు ఎస్‌ఐ అసిఫ్ తెలిపిన వివరాల ప్రకారం.. దూల్మిట్ట మండలం కొండాపూర్ హనుమ తండా పరిధిలోని మహారాజ్ తండాకు చెందిన సభావత్ దేవేందర్ ఐదేళ్ల క్రితం తన అన్న కొడుకు సభావత్ రాజేష్ వద్ద ఒకటిన్నర గుంటల భూమిని కొనుగోలు చేశాడు.
అయితే భూమిని తన పేరుపై రిజిస్ట్రేషన్ చేయకుండా రాజేష్ కాలయాపన చేస్తున్నాడనే విషయంలో, అలాగే వ్యవసాయ భూముల వద్దకు వెళ్లే దారి విషయంలో ఇద్దరి మధ్య కొంతకాలంగా వివాదాలు కొనసాగుతున్నట్లు పోలీసులు తెలిపారు. ఈ క్రమంలో సెప్టెంబర్ 1న ఉదయం వ్యవసాయ బావి వద్ద ఇరువురి మధ్య గొడవ జరిగింది. అనంతరం ఇంటికి వెళ్లిన తర్వాత మధ్యాహ్నం సుమారు 12 గంటల సమయంలో దేవేందర్ కత్తితో రాజేష్‌పై దాడి చేయడంతో ఆయన తల వెనుక భాగంలో గాయమైందని తెలిపారు.
ఈ ఘటనపై మద్దూరు పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు అందడంతో పోలీసులు హత్యాయత్నం కేసు నమోదు చేశారు. నిందితుడు సభావత్ దేవేందర్‌ను సోమవారం (సెప్టెంబర్ 7) అరెస్ట్ చేసి, చేర్యాల జ్యుడీషియల్ మేజిస్ట్రేట్ ఎదుట హాజరుపరచగా కోర్టు రిమాండ్ విధించినట్లు ఎస్‌ఐ అసిఫ్ తెలిపారు. ఈ కేసు దర్యాప్తులో హెడ్ కానిస్టేబుల్ నాగేశ్వరరావు పాల్గొన్నారు.