36 ఏళ్లయినా అభివృద్ధి ఎక్కడ..?మద్దూర్ మండలానికి తప్పని వెనుకబాటుతనం
ప్రభుత్వాలు మారినా మారని రహదారుల దుస్థితి.. ప్రయాణికుల తీవ్ర అవస్థలు
ఇరుకైన ముస్త్యాల – రామవరం రోడ్డును డబుల్ రోడ్డుగా విస్తరించాలని ఎడతెగని డిమాండ్
అసెంబ్లీలో గళమెత్తి నిధులు తీసుకురావాలని స్థానిక ఎమ్మెల్యే పల్లా రాజేశ్వర్‌రెడ్డికి ప్రజల విజ్ఞప్తి
మద్దూరు (హిందుస్థాన్ మీడియా):
దశాబ్దాలు గడిచినా తీరని రోడ్డు కష్టాలు
మద్దూరు ప్రత్యేక మండలంగా ఏర్పాటై 36 సంవత్సరాలు పూర్తవుతున్నా క్షేత్రస్థాయిలో ఆశించిన అభివృద్ధి జరగలేదని మండల ప్రజలు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. పాలకులు, ప్రభుత్వాలు మారుతున్నా మండలంలోని ప్రధాన రహదారుల దుస్థితి మాత్రం మారకపోవడం విడ్డూరంగా ఉందని స్థానికులు ఆవేదన చెందుతున్నారు. అనేక గ్రామాల నుంచి నిత్యం వందలాది మంది రాకపోకలు సాగించే కీలక మార్గాలు నేటికీ ఇరుకుగా, గుంతలమయంగా ఉండటంతో ప్రయాణం తీవ్ర నరకప్రాయంగా మారింది.
డబుల్ రోడ్డు కలగానే మిగిలిన ముస్త్యాల – రామవరం మార్గం
ముఖ్యంగా ముస్త్యాల – రామవరం రహదారిని డబుల్ రోడ్డుగా అభివృద్ధి చేయాలనే డిమాండ్ ఏళ్ల తరబడి పెండింగ్‌లోనే ఉందని ప్రజలు గుర్తుచేస్తున్నారు. రోడ్డు అత్యంత ఇరుకుగా ఉండటంతో ఎదురెదురుగా పెద్ద వాహనాలు వచ్చినప్పుడు సైడ్ ఇచ్చేందుకు కూడా వీలులేక తీవ్ర ఇబ్బందులు ఎదురవుతున్నాయి. రోడ్డు అంచులు సైతం పలుచోట్ల కోతకు గురై ప్రమాదకర లోయలుగా మారడంతో వాహనదారులు నిత్యం ప్రాణభయంతో ప్రయాణించాల్సిన దుస్థితి నెలకొంది.
మౌలిక వసతుల్లో వెనుకబాటు – శాసనసభ్యుడి చొరవ అవసరం
మండల హోదా దక్కి మూడున్నర దశాబ్దాలు గడిచినా కనీస మౌలిక వసతులైన నాణ్యమైన రోడ్లు లేకపోవడం మండల అభివృద్ధికి తీవ్ర అవరోధంగా మారింది. ప్రాంత ప్రగతికి రహదారులే మూలస్తంభాలని గుర్తించి, ప్రస్తుత జనగామ శాసనసభ్యుడు పల్లా రాజేశ్వర్‌రెడ్డి అసెంబ్లీ వేదికగా గళం విప్పి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లాలని మండల ప్రజలు కోరుతున్నారు. మద్దూరు మండలంపై ప్రత్యేక దృష్టి సారించి, ప్రభుత్వంపై ఒత్తిడి తెచ్చి ముస్త్యాల – రామవరం మార్గాన్ని డబుల్ రోడ్డుగా విస్తరించేందుకు తక్షణమే నిధులు మంజూరు చేయించాలని స్థానికులు గట్టిగా డిమాండ్ చేస్తున్నారు.
– | హిందుస్థాన్ మీడియా |
సామాన్యుడి నేస్తం 📰