జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన విద్యార్థులను సన్మానించిన దుద్దెడ క్లబ్ సభ్యులు
కొండపాక, సెప్టెంబర్ 5, హిందుస్థాన్ మీడియా:
ఎస్‌జీఎఫ్ జిల్లా స్థాయి కబడ్డీ పోటీలకు ఎంపికైన దుద్దెడ విద్యార్థులను గ్రామ కబడ్డీ క్లబ్ సభ్యులు ఘనంగా సన్మానించారు. ఈ నెల 1 నుంచి 3వ తేదీ వరకు సిరిసనగండ్ల జిల్లా పరిషత్ ఉన్నత పాఠశాలలో జరిగిన కొండపాక మండల స్థాయి ఎస్‌జీఎఫ్ క్రీడా పోటీల్లో ప్రతిభ కనబరిచి జిల్లా స్థాయికి ఎంపికయ్యారు.
అండర్-17 విభాగంలో 10వ తరగతి విద్యార్థులు జక్కుల సృజన్, దోమల మహేష్, అండర్-14 విభాగంలో 8వ తరగతి విద్యార్థులు పి. నైతిక్, జి. హర్షవర్ధన్ ఎంపికయ్యారు. ఈ సందర్భంగా గ్రామ సర్పంచ్ మిద్దె శివకుమార్, కబడ్డీ క్లబ్ అధ్యక్షుడు పెద్దంకుల శ్రీకాంత్, ప్రధాన కార్యదర్శి రోషిలి కిషన్ విద్యార్థులను అభినందించారు.
విద్యార్థులకు గత కొంతకాలంగా గ్రామ కబడ్డీ క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ ఇస్తున్నామని, చదువుతో పాటు క్రీడల్లోనూ మరింత రాణించాలని వారు సూచించారు. కబడ్డీపై ఆసక్తి ఉన్న విద్యార్థులకు ప్రతిరోజూ సాయంత్రం క్లబ్ ఆధ్వర్యంలో శిక్షణ అందిస్తామని తెలిపారు.
అంతకుముందు పాఠశాల ప్రార్థనా కార్యక్రమంలో ప్రధానోపాధ్యాయురాలు లక్ష్మి, ఉపాధ్యాయులు విద్యార్థులను సన్మానించారు. కార్యక్రమంలో తల్లిదండ్రులు, ఉపసర్పంచ్ జానకి యాదగిరి, వార్డు సభ్యులు కొమ్ము స్వామి, ఏఎంసీ డైరెక్టర్ కొమ్ము మల్లికార్జున్, గ్రామ ప్రముఖులు, ఉపాధ్యాయులు తదితరులు పాల్గొన్నారు.