నూతనంగా విచ్చేసిన నెక్కొండ ఎస్సైకి సర్పంచుల బృందం సత్కారం!
ఎస్సై జె. శ్రవణ్ కుమార్ను మర్యాదపూర్వకంగా కలిసి శుభాకాంక్షలు తెలిపిన మండల ప్రజాప్రతినిధులు మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్ల భరోసా నెక్కొండ (హిందుస్థాన్ మీడియా): నెక్కొండ మండలానికి నూతనంగా బదిలీపై విచ్చేసిన ఎస్సై జె. శ్రవణ్ కుమార్ను మండల పరిధిలోని సర్పంచ్ల బృందం శనివారం మర్యాదపూర్వకంగా కలిసింది. ఈ సందర్భంగా ఎస్సై శ్రవణ్ కుమార్కు శాలువాతో ఘనంగా సత్కరించి హృదయపూర్వక స్వాగతం పలుకుతూ శుభాకాంక్షలు తెలియజేశారు. మండలంలో శాంతిభద్రతల పరిరక్షణకు, గ్రామాల్లో ఎలాంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా పోలీస్ శాఖకు గ్రామ పంచాయతీల తరఫున ఎల్లవేళలా పూర్తి సహకారం అందిస్తామని సర్పంచ్లు తెలిపారు. ఈ కార్యక్రమంలో సర్పంచ్ల ఫోరం మండల అధ్యక్షుడు...