సరస్వతి దేవి అలంకరణలో దుర్గా మాత..భక్తిశ్రద్ధలతో కుంకుమార్చన
మద్దూరు రామాలయ యూత్ ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్ 16, హిందుస్థాన్ మీడియా: మద్దూరు రామాలయ యూత్ ఆధ్వర్యంలో దసరా నవరాత్రుల సందర్భంగా దుర్గామాతను సరస్వతి దేవి అలంకరణలో కొలువుదీర్చి ప్రత్యేక పూజలు నిర్వహించారు. శుక్రవారం ఆలయంలో అమ్మవారికి కుంకుమార్చన కార్యక్రమాన్ని భక్తిశ్రద్ధలతో చేపట్టారు. సరస్వతి దేవి అలంకరణలో దర్శనమిచ్చిన అమ్మవారిని భక్తులు భక్తితో పూజించారు. ఆలయ పూజారి పనుగంటి తిరుపతయ్య ఆధ్వర్యంలో ప్రత్యేక పూజలు, కుంకుమార్చన నిర్వహించారు. మహిళలు పెద్ద సంఖ్యలో పాల్గొని అమ్మవారికి కుంకుమ సమర్పించి, కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని, ఆయురారోగ్యాలు కలగాలని ప్రార్థించారు. విద్య, జ్ఞానం, వివేకానికి ప్రతీకగా భావించే సరస్వతి దేవి అలంకరణలో అమ్మవారి దర్శనం...