సద్దుల బతుకమ్మకు ముస్తాబవుతున్న ఆకునూరు..!
చెరువులు, బతుకమ్మ కూడళ్ల వద్ద పారిశుద్ధ్య పనులు సర్పంచ్ కొమ్ము రవి ఆధ్వర్యంలో ఏర్పాట్లు సిద్దిపేట జిల్లా, చేర్యాల, అక్టోబర్ 15, హిందుస్థాన్ మీడియా: సద్దుల బతుకమ్మ పండుగను పురస్కరించుకుని ఆకునూరు మేజర్ గ్రామ పంచాయతీలో ఏర్పాట్లు ముమ్మరంగా సాగుతున్నాయి. గ్రామ సర్పంచ్ కొమ్ము రవి ఆధ్వర్యంలో గురువారం ఎల్లమ్మ, పోల్కమ్మ చెరువులతో పాటు మహిళలు బతుకమ్మ ఆడే ప్రధాన కూడళ్లలో శుభ్రత పనులు చేపట్టారు.జేసీబీ సహాయంతో పిచ్చి మొక్కలను తొలగించి, పండుగ నిర్వహణకు అనువుగా పరిసరాలను శుభ్రం చేశారు. మహిళలకు ఇబ్బందులు కలగకుండా ఆయా ప్రాంతాల్లో వీధి దీపాలను ఏర్పాటు చేసినట్లు గ్రామ పంచాయతీ వర్గాలు తెలిపాయి.ఈ కార్యక్రమంలో వార్డు సభ్యుడు జూపల్లి కార్తీక్...