20 నెలలుగా అందని వేతనాలు సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ల్యాబ్ టెక్నీషియన్ల ఆకలి కేకలు..?

​రోగులకు నిరంతరాయంగా రక్త పరీక్షల సేవలు అందిస్తున్నా తీవ్ర నిర్లక్ష్యం ​కుటుంబ పోషణ భారమై అప్పుల ఊబిలోకి ఉద్యోగులు.. వెంటనే బకాయిలు చెల్లించాలని డిమాండ్ ​సిద్దిపేట (హిందుస్థాన్ మీడియా): ప్రజారోగ్య వ్యవస్థలో రోగ నిర్ధారణ పరీక్షలు చేస్తూ కీలక పాత్ర పోషిస్తున్న ప్రభుత్వ ఆసుపత్రుల ల్యాబ్ టెక్నీషియన్ల పట్ల వైద్య ఆరోగ్య శాఖ తీవ్ర ఉదాసీనత కనబరుస్తోంది. సిద్దిపేట జిల్లా వ్యాప్తంగా ప్రాథమిక ఆరోగ్య కేంద్రాలు (పీహెచ్‌సీలు), కమ్యూనిటీ హెల్త్ సెంటర్లలో విధులు నిర్వర్తిస్తున్న ల్యాబ్ టెక్నీషియన్లకు గత 20 నెలలుగా ఒక్క రూపాయి కూడా వేతనం అందకపోవడం తీవ్ర ఆందోళన కలిగిస్తోంది. ఇది కేవలం ఒక ప్రాంతానికో పరిమితమైన సమస్య కాదని, జిల్లావ్యాప్తంగా పనిచేస్తున్న...