గిరాయి పల్లెలో రీ సర్వే పనులను పరిశీలించిన కొండపాక తహసీల్దార్
రైతులు, గ్రామ ప్రజలు సహకరించాలని సూచన సిద్దిపేట జిల్లా, కొండపాక, అక్టోబర్ 13, హిందుస్థాన్ మీడియా: కొండపాక మండలం గిరాయిపల్లి గ్రామంలో ప్రభుత్వం చేపట్టిన భూ రీ సర్వే పనులను మంగళవారం తహసీల్దార్ మల్లికార్జున్ రెడ్డి పరిశీలించారు. ఈ సందర్భంగా సర్వే పనుల పురోగతిని సమీక్షించి, మండల సర్వేయర్కు పలు సూచనలు చేశారు. రీ సర్వే ప్రక్రియ సజావుగా పూర్తయ్యేందుకు గ్రామ రైతులు, ప్రజలు అధికారులకు సహకరించాలని తహసీల్దార్ సూచించారు. భూములకు సంబంధించిన వివరాలను సర్వే సిబ్బందికి అందించి, సర్వే సమయంలో అవసరమైన సహకారం అందించాలని కోరారు.