జాలపల్లి లబ్ధిదారుడికి సీఎంఆర్ఎఫ్ చెక్కు అందజేత

మాజీ సర్పంచ్‌ చొప్పరి వరలక్ష్మి సాగర్‌, చొప్పరి సాగర్‌ చేతుల మీదుగా పంపిణీ సిద్దిపేట జిల్లా, దూల్మిట్ట, అక్టోబర్‌ 12, హిందుస్థాన్‌ మీడియా: దూల్మిట్ట మండలం జాలపల్లి గ్రామానికి చెందిన మెతుకు బాల్‌రెడ్డి కుమారుడు మెతుకు నర్సిరెడ్డికి ముఖ్యమంత్రి సహాయ నిధి (సీఎంఆర్‌ఎఫ్‌) ద్వారా మంజూరైన రూ.11,500 చెక్కును మాజీ సర్పంచ్‌ చొప్పరి వరలక్ష్మి సాగర్‌, దూల్మిట్ట మండల బీఆర్‌ఎస్‌ క్లస్టర్‌ ఇన్‌చార్జి చొప్పరి సాగర్‌ ముదిరాజ్‌ అందజేశారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ, ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్న కుటుంబాలకు వైద్య ఖర్చుల కోసం సీఎంఆర్‌ఎఫ్‌ ద్వారా అందే ఆర్థిక సహాయం ఉపయోగకరంగా ఉంటుందని పేర్కొన్నారు. అర్హులైన లబ్ధిదారులకు ప్రభుత్వ సహాయ పథకాలు అందడం ద్వారా...