బిర్యానీలో బైండింగ్ వైర్ కలకలం: ప్రవీణ్ బార్పై మున్సిపల్ కమిషనర్ అభిలాష్ ఆకస్మిక తనిఖీ..
ఫుడ్ సేఫ్టీ అధికారుల నిద్రమత్తు వీడేదెన్నడు? ఫుడ్ ఐటమ్లో వైర్ ముక్కపై స్పందించి రంగంలోకి దిగిన మున్సిపల్ యంత్రాంగం కిచెన్, ఆహార నిల్వల పరిశీలన.. లోపాలపై జరిమానా విధిస్తామని కమిషనర్ హెచ్చరిక కేవలం మున్సిపల్ తనిఖీలే సరిపోవు.. జిల్లా ఫుడ్ సేఫ్టీ అధికారులు నిరంతరం పర్యవేక్షించాలని ప్రజల డిమాండ్ చేర్యాల (హిందుస్థాన్ మీడియా): చేర్యాల పట్టణంలోని ప్రవీణ్ బార్ & రెస్టారెంట్లో చికెన్ బిర్యానీ ఆహారంలో బైండింగ్ వైర్ ముక్క కనిపించిందంటూ వచ్చిన ఆరోపణలు కలకలం రేపాయి. ఈ ఘటనపై ఫిర్యాదులు రావడంతో చేర్యాల మున్సిపల్ కమిషనర్ అభిలాష్ సోమవారం తమ సిబ్బందితో కలిసి సదరు బార్పై ఆకస్మిక తనిఖీలు చేపట్టారు. ఈ సందర్భంగా బార్లోని...