పారిశుద్ధ్య నిర్వహణను పటిష్టం చేయడమే లక్ష్యం: మద్దూర్ ఎంపీడీవో రమేష్
మద్దూరు మండలంలో పంచాయతీ ట్రాక్టర్లకు జీపీఎస్ ట్రాకింగ్ చెత్త సేకరణ వాహనాలపై నిరంతర పర్యవేక్షణ సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్ 12, హిందుస్థాన్ మీడియా: గ్రామాల్లో పారిశుధ్య నిర్వహణను మరింత పటిష్టం చేయడంతో పాటు, ఇంటింటికీ చెత్త సేకరణను సమర్థవంతంగా నిర్వహించేందుకు మద్దూరు మండలంలోని అన్ని గ్రామ పంచాయతీల ట్రాక్టర్లకు జీపీఎస్ ట్రాకింగ్ సిస్టమ్‌ను ఏర్పాటు చేశారు.గ్రామ పంచాయతీల పరిధిలో ఇంటింటికీ వెళ్లి తడి, పొడి చెత్తతో పాటు ఇతర రకాల వ్యర్థాలను సేకరించేందుకు పంచాయతీ ట్రాక్టర్లను వినియోగిస్తున్నారు. అయితే ప్రతి గ్రామంలోని అన్ని వీధులు, వార్డుల్లో ట్రాక్టర్లు క్రమం తప్పకుండా తిరుగుతూ చెత్తను సేకరిస్తున్నాయా లేదా అనే విషయాన్ని పర్యవేక్షించేందుకు జీపీఎస్ వ్యవస్థను అందుబాటులోకి...