మద్దూరు మండలంలో ఘనంగా పెత్రమాస బతుకమ్మ సంబరాలు

రంగురంగుల పూలతో బతుకమ్మల అలంకరణ.. సంప్రదాయ పాటలతో మహిళల సందడి సిద్దిపేట జిల్లా, మద్దూరు, అక్టోబర్‌ 10, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగలో భాగంగా మద్దూరు మండల కేంద్రంతో పాటు పరిసర గ్రామాల్లో పెత్రమాస బతుకమ్మ వేడుకలను మహిళలు భక్తిశ్రద్ధలతో ఘనంగా నిర్వహించారు. తంగేడు, గునుగు, బంతి తదితర రంగురంగుల పూలతో బతుకమ్మలను అందంగా పేర్చి గౌరమ్మకు ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం బతుకమ్మల చుట్టూ చేరిన మహిళలు సంప్రదాయ బతుకమ్మ పాటలు పాడుతూ ఉత్సాహంగా వేడుకల్లో పాల్గొన్నారు. తెలంగాణ ఆడపడుచుల ఆత్మీయతకు, ప్రకృతితో మమేకమైన జీవన విధానానికి బతుకమ్మ పండుగ ప్రతీకగా నిలుస్తుందని మహిళలు పేర్కొన్నారు. పూల...