పంచతంత్ర పాఠశాలలో ఘనంగా బతుకమ్మ సంబరాలు

విద్యార్థుల తల్లుల భాగస్వామ్యంతో సందడిగా వేడుకలు తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలను భావితరాలకు అందించడమే లక్ష్యం చేర్యాల, హిందుస్థాన్‌ మీడియా: తెలంగాణ సంస్కృతి, సంప్రదాయాలకు ప్రతీకగా నిలిచే బతుకమ్మ పండుగను పురస్కరించుకొని చేర్యాల పట్టణంలోని పంచతంత్ర పాఠశాలలో ముందస్తు బతుకమ్మ సంబరాలను ఘనంగా నిర్వహించారు. పాఠశాల ఆవరణలో నిర్వహించిన ఈ వేడుకల్లో విద్యార్థుల తల్లులు ఉత్సాహంగా పాల్గొని పండుగ సందడిని రెట్టింపు చేశారు. పాఠశాల వాతావరణం బతుకమ్మ సంబరాలతో కళకళలాడింది.ఈ సందర్భంగా పాఠశాల ప్రిన్సిపాల్‌ శ్యామల మాట్లాడుతూ.. విద్యార్థులకు, వారి తల్లిదండ్రులకు బతుకమ్మ, దసరా పండుగ శుభాకాంక్షలు తెలిపారు. బతుకమ్మ పండుగ తెలంగాణ ఆడపడుచుల ఆత్మగౌరవానికి, ప్రకృతి ఆరాధనకు, మన సంస్కృతి సంప్రదాయాలకు ప్రతీకగా నిలుస్తుందని పేర్కొన్నారు....