మార్కెట్ కమిటీ డైరెక్టర్ గా పచ్చిమడ్ల వెంకటయ్య... గౌడ సంఘం ఆత్మీయ సత్కారం
రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద ఘనంగా సన్మానం పుష్పగుచ్ఛాలు, శాలువాతో అభినందించిన చేర్యాల గౌడ సంఘం చేర్యాల, హిందుస్థాన్ మీడియా: చేర్యాల మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా పచ్చిమడ్ల వెంకటయ్య గౌడ్ నియమితులైన సందర్భంగా చేర్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో మంగళవారం ఘనంగా సన్మానించారు. చేర్యాల రేణుక ఎల్లమ్మ ఆలయం వద్ద గౌడ సంఘం నాయకులు వెంకటయ్య గౌడ్‌కు పుష్పగుచ్ఛం అందజేసి, శాలువాతో సత్కరించారు. అనంతరం మిఠాయిలు తినిపించి అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా గౌడ సంఘం నాయకులు మాట్లాడుతూ.. మార్కెట్ కమిటీ డైరెక్టర్‌గా బాధ్యతలు చేపట్టిన పచ్చిమడ్ల వెంకటయ్య గౌడ్ రైతులు, వ్యాపారులు, గౌడ సామాజిక వర్గం సమస్యల పరిష్కారానికి తనవంతు కృషి చేయాలని ఆకాంక్షించారు....