రైతుల సమస్యల పరిష్కారానికి కృషి చేస్తా: మార్కెట్ కమిటీ చైర్మన్ కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి

మార్కెట్ యార్డులో ఘనంగా బాధ్యతల స్వీకరణ.. హాజరై ఆశీర్వదించిన మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ​రైతులకు ఎల్లవేళలా అందుబాటులో ఉంటూ పంట విక్రయాల్లో ఎలాంటి ఇబ్బందులు రాకుండా చూస్తాం: చైర్మన్ హామీ ​కాంగ్రెస్ శ్రేణులు, ప్రజాప్రతినిధులు, అన్నదాతల కోలాహలం మధ్య పదవీ బాధ్యతల స్వీకరణ ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​సిద్దిపేట జిల్లా చేర్యాల వ్యవసాయ మార్కెట్ కమిటీ నూతన చైర్మన్‌‌గా కొమ్మూరి ప్రశాంత్ రెడ్డి బాధ్యతలు స్వీకరించారు.ఛైర్మన్ తో పాటు డైరెక్టర్లు కూడా ప్రమాణ స్వీకారం చేసారు.స్థానిక మార్కెట్ యార్డు ప్రాంగణంలో నిర్వహించిన ఈ కార్యక్రమానికి మాజీ ఎమ్మెల్యే, కాంగ్రెస్ పార్టీ నియోజకవర్గ ఇన్‌చార్జి కొమ్మూరి ప్రతాప్ రెడ్డి ముఖ్య అతిథిగా హాజరై, ప్రశాంత్...