తండ్రి జ్ఞాపకార్థం బైరాన్ పల్లిలో మినీ వాటర్ ట్యాంక్ నిర్మాణం.!

గ్రామ ప్రజల దాహార్తి తీర్చేందుకు సొంత ఖర్చులతో ముందుకొచ్చిన దాత రాములు సేవా స్ఫూర్తి అభినందనీయం: సర్పంచ్‌ బర్మ రాజమల్లయ్య సిద్దిపేట జిల్లా, దూల్మిట్ట, అక్టోబర్‌ 5, హిందుస్థాన్‌ మీడియా: తండ్రి జ్ఞాపకార్థం గ్రామ ప్రజల దాహార్తిని తీర్చేందుకు ఓ దాత ముందుకొచ్చారు. దూల్మిట్ట మండల కేంద్రంలోని బైరాన్‌పల్లి గ్రామపంచాయతీ పరిధిలోని 1వ వార్డు ఎస్సీ కాలనీలో మినీ వాటర్‌ ట్యాంక్‌ నిర్మాణానికి సోమవారం గ్రామ సర్పంచ్‌ బర్మ రాజమల్లయ్య భూమిపూజ నిర్వహించారు. కీ.శే. అలగోని లింగయ్య జ్ఞాపకార్థం ఆయన పెద్ద కుమారుడు అలగోని రాములు సొంత ఖర్చులతో మినీ వాటర్‌ ట్యాంక్‌ నిర్మించేందుకు దాతగా ముందుకొచ్చినట్లు సర్పంచ్‌ తెలిపారు. గ్రామ ప్రజల తాగునీటి అవసరాలను...