ఘనంగా గ్యారాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు: జనసంద్రంగా మారిన సభా ప్రాంగణం!

​పెద్ద అంబర్‌‌పేట్ స్వర్ణ మహల్‌లో అట్టహాసంగా వేడుకలు.. అభిమానులు, శ్రేయోభిలాషుల కోలాహలం ​హాజరై శుభాకాంక్షలు తెలిపిన ఎమ్మెల్యేలు మల్‌రెడ్డి రంగారెడ్డి, బీర్ల ఐలయ్య ​ప్రజాసేవలో శ్రీనివాస్ గౌడ్ మరింత ఉన్నత స్థాయికి ఎదగాలని నేతల ఆకాంక్ష ​పెద్ద అంబర్‌పేట్ (హిందుస్థాన్ మీడియా): ​మాజీ కౌన్సిలర్, జీఎస్ సేవాసమితి చైర్మన్ గ్యారాల శ్రీనివాస్ గౌడ్ జన్మదిన వేడుకలు పెద్ద అంబర్‌పేట్ పరిధిలోని పసుమాముల స్వర్ణ మహల్‌లో అత్యంత ఘనంగా నిర్వహించారు. ఈ వేడుకలకు అభిమానులు, కార్యకర్తలు, వివిధ రాజకీయ పార్టీల ప్రజాప్రతినిధులు, వివిధ వర్గాల నాయకులు, శ్రేయోభిలాషులు భారీ సంఖ్యలో తరలిరావడంతో ప్రాంగణమంతా జనసంద్రంగా మారి సందడి వాతావరణం నెలకొంది. ​ఎమ్మెల్యేల చేతుల మీదుగా ఘన సత్కారం...