చేర్యాల నూతన ఎక్సైజ్ ఎస్సై ని సన్మానించిన గౌడ సంఘం నేతలు

నూతన ఎస్సైని శాలువాతో సత్కరించి శుభాకాంక్షలు తెలిపిన గౌడ సంఘం నేతలు ​శాంతిభద్రతల పరిరక్షణ, అక్రమ మద్యం నివారణకు సహకరించాలని ఎస్సై విజ్ఞప్తి ​కార్యక్రమంలో పాల్గొన్న గౌడ సంఘం ముఖ్య ప్రతినిధులు ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​చేర్యాల ఎక్సైజ్ ఎస్సైకి ఆత్మీయ సత్కారం ​చేర్యాల ప్రొహిబిషన్ అండ్ ఎక్సైజ్ స్టేషన్ నూతన సబ్ ఇన్‌స్పెక్టర్‌గా (ఎస్సై) బండి నారాయణ బాధ్యతలు స్వీకరించారు. ఈ సందర్భంగా శనివారం చేర్యాల గౌడ సంఘం ఆధ్వర్యంలో ఆయనను మర్యాదపూర్వకంగా కలిసి పుష్పగుచ్ఛం అందించి, శాలువాతో ఘనంగా సత్కరించారు. పట్టణానికి నూతనంగా విచ్చేసిన ఎస్సైకి సంఘం పక్షాన హృదయపూర్వక స్వాగతం పలికి శుభాకాంక్షలు తెలియజేశారు. ​సమస్యల పరిష్కారానికి కృషి చేయాలని వినతి...