మద్దూర్ జడ్పీహెచ్‌ఎస్‌ లో నూతన సౌచాలయ సదుపాయాలు ప్రారంభం

రూ.5 లక్షల వ్యయంతో నిర్మాణం.. దాతల సహకారంతో సౌకర్యం విద్యార్థినుల అవసరాలను గుర్తించి ముందుకొచ్చిన దాతలు సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 3, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండల కేంద్రంలోని జడ్పీహెచ్‌ఎస్‌ ఉన్నత పాఠశాలలో బాలికల కోసం ప్రత్యేకంగా నిర్మించిన నూతన సౌచాలయ (మరుగుదొడ్లు )సదుపాయాలను శనివారం ప్రారంభించారు. హైదరాబాద్‌కు చెందిన దీపా జ్యువెలర్స్‌ సౌజన్యంతో, మోహిత్‌, దినేష్‌, తౌటి భూమయ్య సహకారంతో సుమారు రూ.5 లక్షల వ్యయంతో ఈ సదుపాయాలను ఏర్పాటు చేశారు.పాఠశాల ప్రధానోపాధ్యాయుడు సర్వర్‌ మోయుద్దీన్‌ అధ్యక్షతన నిర్వహించిన కార్యక్రమానికి దాతలు మోహిత్‌, దినేష్‌, తౌటి భూమయ్య ముఖ్య అతిథులుగా హాజరయ్యారు. అనంతరం మద్దూరు గ్రామ సర్పంచ్‌ దామెర మల్లేశం, మండల విద్యాధికారి...