జాతిపితకు చోటేది? చేర్యాల మున్సిపాలిటీ తీరుపై ప్రజల తీవ్ర ఆగ్రహo..!

రోడ్డు విస్తరణలో తొలగించి ఏళ్లు గడుస్తున్నా పట్టించుకోని పాలకవర్గం, అధికారులు ​గాంధీ జయంతి నాడు కుల సంఘం విగ్రహానికే పూలమాలలు.. అధికారుల తీరుపై విమర్శలు ​ల్యాండ్‌మార్క్‌గా నిలిచిన గాంధీ సెంటర్‌లో విగ్రహాన్ని పునఃప్రతిష్టించాలని పట్టణవాసుల డిమాండ్ ​చేర్యాల (హిందుస్థాన్ మీడియా): ​చరిత్ర ఉన్న పట్టణంలో జాతిపితకు తప్పని నిర్లక్ష్యం ​ఒకప్పుడు తాలూకా కేంద్రంగా, ఆ తర్వాత శాసనసభ నియోజకవర్గంగా వెలుగొంది, ప్రస్తుతం మున్సిపాలిటీగా రూపాంతరం చెందిన చేర్యాల పట్టణం ఎందరో బయటి వ్యక్తులకు రాజకీయ భవిష్యత్తును, జీవితాలను ఇచ్చింది. కానీ దేశానికి స్వాతంత్ర్యం తెచ్చిపెట్టిన జాతిపిత మహాత్మా గాంధీకి మాత్రం నిలువెత్తు విగ్రహాన్ని ఏర్పాటు చేయడానికి కాస్త చోటు ఇవ్వలేకపోవడంపై తీవ్రస్థాయిలో విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. చేర్యాల...