కుకునూరుపల్లిలో ఘనంగా గాంధీ జయంతి వేడుకలు
నూతన గాంధీ విగ్రహ ఏర్పాటుకు భూమిపూజ సత్యం, అహింస సిద్ధాంతాలను నేటి తరం ఆదర్శంగా తీసుకోవాలి: సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 2, కుకునూరుపల్లి, హిందుస్థాన్ మీడియా: కుకునూరుపల్లి మండల కేంద్రంలో శుక్రవారం జాతిపిత మహాత్మా గాంధీ జయంతి వేడుకలను ఘనంగా నిర్వహించారు. గ్రామ సర్పంచ్ మల్లం కనకవ్వ ఐలయ్య ఆధ్వర్యంలో జరిగిన కార్యక్రమంలో గాంధీజీ విగ్రహానికి పూలమాలలు వేసి ఘనంగా నివాళులర్పించారు. ఈ సందర్భంగా మహాత్మా గాంధీ దేశానికి చేసిన సేవలను, ఆయన పాటించిన సత్యం, అహింస సిద్ధాంతాలను నాయకులు స్మరించుకున్నారు. గాంధీజీ ఆశయాలను నేటి తరం ఆదర్శంగా తీసుకుని సమాజ అభివృద్ధికి కృషి చేయాలని సర్పంచ్ మల్లం కనకవ్వ...