గాంధీ జయంతి సందర్భంగా స్వచ్ఛ భారత్‌ కార్యక్రమం

గాంధీజీకి కాంగ్రెస్‌ శ్రేణుల ఘన నివాళులు పరిసరాల పరిశుభ్రతపై ప్రజలకు అవగాహన కల్పించిన నాయకులు సిద్దిపేట జిల్లా, అక్టోబర్‌ 2, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: జనగామ నియోజకవర్గ కాంగ్రెస్‌ పార్టీ ఇన్‌చార్జ్‌, మాజీ ఎమ్మెల్యే కొమ్మూరి ప్రతాప్‌రెడ్డి ఆదేశాల మేరకు మద్దూరు మండల కాంగ్రెస్‌ పార్టీ అధ్యక్షుడు మారెళ్ల భాస్కర్‌రెడ్డి ఆధ్వర్యంలో శుక్రవారం మద్దూరు మండల కేంద్రంలో మహాత్మా గాంధీ జయంతి కార్యక్రమాన్ని నిర్వహించారు. ఈ సందర్భంగా ముందుగా మహాత్మా గాంధీ చిత్రపటానికి పూలమాల వేసి నాయకులు, కార్యకర్తలు ఘనంగా నివాళులర్పించారు. అనంతరం కేక్‌ కట్‌ చేసి గాంధీ జయంతి శుభాకాంక్షలు తెలిపారు.తదుపరి కాంగ్రెస్‌ నాయకులు, కార్యకర్తలు కలిసి స్వచ్ఛ భారత్‌ కార్యక్రమాన్ని నిర్వహించి పరిసరాలను...