భూగర్భ జలాల పరిరక్షణకు ప్రతి ఒక్కరు కృషి చేయాలి
బైరాన్‌పల్లిలో ప్రత్యేక గ్రామసభ వర్షపు నీటిని భూమిలోకి ఇంకించేలా చర్యలు చేపట్టాలి: సర్పంచ్ బర్మా రాజమల్లయ్య సిద్దిపేట జిల్లా, అక్టోబర్ 2, దూల్మిట్ట, హిందుస్థాన్ మీడియా: స్వచ్ఛతా హి సేవా కార్యక్రమంలో భాగంగా సెప్టెంబర్ 17 నుంచి కొనసాగుతున్న కార్యక్రమాల్లో భాగంగా మహాత్మాగాంధీ జయంతిని పురస్కరించుకుని బైరాన్‌పల్లి గ్రామంలో శుక్రవారం ప్రత్యేక గ్రామసభ నిర్వహించారు. సర్పంచ్ బర్మా రాజమల్లయ్య అధ్యక్షతన జరిగిన ఈ గ్రామసభకు పాలకవర్గ సభ్యులు, పంచాయతీ సిబ్బంది, గ్రామస్తులు హాజరయ్యారు. గ్రామసభకు ముందు మహాత్మాగాంధీ జయంతి సందర్భంగా సర్పంచ్ బర్మా రాజమల్లయ్య, పాలకవర్గ సభ్యులు గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసి నివాళులర్పించారు. అనంతరం గ్రామపంచాయతీ కార్యాలయంలో పంచాయతీ సిబ్బందిని సన్మానించారు. తదుపరి నిర్వహించిన...