నాగపురి ఉన్నత పాఠశాలలో అంతర్జాతీయ వయోవృద్ధుల దినోత్సవం
అంతర్తరాల అనుబంధం.. వయోవృద్ధుల అనుభవాలపై విద్యార్థులకు అవగాహన రిటైర్డ్ ఉద్యోగి మల్లయ్య పంతులుకు ఘన సన్మానం సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 29, చేర్యాల, హిందుస్థాన్ మీడియా: ప్రభుత్వ, జిల్లా సంక్షేమ అధికారి ఆదేశాల మేరకు ఈ నెల 24 నుంచి అక్టోబర్ 1వ తేదీ వరకు నిర్వహిస్తున్న అంతర్జాతీయ వయోవృద్ధుల సంబరాల్లో భాగంగా చేర్యాల మండలం నాగపురి ఉన్నత పాఠశాలలో మంగళవారం ప్రత్యేక కార్యక్రమాన్ని నిర్వహించారు. ‘అంతర్తరాల అనుబంధం–అభ్యసనం’ అనే అంశంపై గ్రామానికి చెందిన సీనియర్ సిటిజన్, రిటైర్డ్ ఉద్యోగి అభినపు మల్లయ్య పంతులును పాఠశాలకు ఆహ్వానించారు. ఈ సందర్భంగా ఆయన తన కాలం నాటి జీవన విధానం, నాటి నుంచి నేటి వరకు సమాజంలో...