పట్టభద్రుల ఓటరు నమోదుకు దరఖాస్తుల ఆహ్వానం

వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గానికి ఫారం–18 ద్వారా దరఖాస్తు నవంబర్‌ 6లోగా మద్దూరు ఎంపీడీవో కార్యాలయంలో సమర్పించాలి సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 29, మద్దూరు, హిందుస్థాన్ మీడియా: వరంగల్‌–ఖమ్మం–నల్లగొండ పట్టభద్రుల నియోజకవర్గ ఓటరు జాబితాలో అర్హులైన పట్టభద్రుల పేర్ల నమోదుకు దరఖాస్తులను స్వీకరిస్తున్నట్లు మద్దూరు తహశీల్దార్‌ ఒక ప్రకటనలో తెలిపారు. అర్హత కలిగిన పట్టభద్రులు ఫారం–18లో తమ దరఖాస్తులను సమర్పించాలని సూచించారు. అర్హులైన పట్టభద్రులు తమ దరఖాస్తులను నిర్ణీత గడువు నవంబర్ 6 వ తేదీ లోగా మద్దూరు ఎంపీడీవో కార్యాలయంలో దరఖాస్తులు సమర్పించాలని కోరారు.