నర్సాయపల్లి లో మష్రూమ్‌ సాగు పై అవగాహన సదస్సు

గ్రామీణ యువత, రైతులకు అదనపు ఆదాయంపై శిక్షణ తక్కువ పెట్టుబడితో స్వయం ఉపాధి అవకాశాలపై అవగాహన సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్‌ 29, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలం నర్సాయపల్లి గ్రామంలో గ్రామీణ ప్రాంతాల్లో మష్రూమ్‌ సాగును ప్రోత్సహించి రైతులు, యువతకు స్వయం ఉపాధి, అదనపు ఆదాయ అవకాశాలు కల్పించే లక్ష్యంతో శిక్షణా కార్యక్రమాన్ని ప్రారంభించారు. గ్రామ సర్పంచ్‌, మద్దూరు మండల అధ్యక్షుడు శనిగరం సత్యనారాయణ ఆధ్వర్యంలో ఈ కార్యక్రమం నిర్వహించారు.యూనియన్‌ బ్యాంక్‌ ఆర్థిక సహకారంతో DHAN Foundation ఆధ్వర్యంలో నిర్వహించిన ఈ శిక్షణలో మష్రూమ్‌ సాగు విధానం, సాగుకు అవసరమైన పద్ధతులు, ఉత్పత్తి ద్వారా లభించే ఆదాయం, మార్కెటింగ్‌ అవకాశాలపై శిక్షణార్థులకు అవగాహన కల్పించారు. తక్కువ...