ఇటు కోతులు...అటు కుక్కల గుంపులు.. ప్రజల తీవ్ర అవస్థలు..
ప్రజలకు కంటిమీద కునుకు లేకుండా చేస్తున్న మూగజీవాల బెడద వీధి కుక్కలు, కోతుల సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలి రాష్ట్ర ప్రభుత్వం తక్షణమే ప్రత్యేక కార్యాచరణ చేపట్టాలని ప్రజల డిమాండ్ సిద్దిపేట జిల్లా, సెప్టెంబర్ 29, హిందుస్థాన్ మీడియా: మద్దూరు మండలంలోని పలు గ్రామాల్లో వీధి కుక్కలు, కోతుల బెడద రోజురోజుకూ తీవ్రంగా మారుతోందని స్థానికులు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఒకవైపు ఇళ్ల పరిసరాల్లో కోతులు సంచరిస్తుండగా.. మరోవైపు వీధుల్లో కుక్కలు గుంపులుగా తిరుగుతుండటంతో ప్రజలు ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. ఇళ్ల ముందు, వీధుల్లో గుంపులుగా కుక్కలు సంచరిస్తుండటంతో చిన్నారులు, మహిళలు, వృద్ధులు బయటకు రావాలంటేనే భయపడుతున్న పరిస్థితి నెలకొంది. ముఖ్యంగా ద్విచక్ర వాహనదారులను కుక్కలు వెంటాడుతుండటంతో...